హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల యేటిగట్టు’(SYG). రోహిత్ కెపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం 120 రోజుల షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. దీంతో దాదాపు 75శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన కీలక సన్నివేశాల కోసం ప్రస్తుతం మూడు భారీ సెట్లను నిర్మిస్తున్నారు.
నెక్ట్స్ షెడ్యూల్ ఈ సెట్స్‌లోనే జరుగనున్నది. అద్భుతమైన విజవల్స్, ఉత్కంఠను కలిగించే భారీ పోరాట సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటివరకూ చేయని మోస్ట్ పవర్ఫుల్ పాత్రను సాయిదుర్గతేజ్ చేస్తున్నారని, ఈ పాత్రకోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారని, త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్.