Sydney Sweeney Bollywood Offer | హాలీవుడ్ స్టార్ నటి సిడ్నీ స్వీనీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇండియాకు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ భారతీయ చిత్రంలో నటించడానికి ఆమెకు ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత సినీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాలో సిడ్నీ ఒక యువ అమెరికన్ స్టార్ పాత్రలో కనిపించనుందని ఆమె ఒక భారతీయ సెలబ్రిటీతో ప్రేమలో పడుతుందని కథనం చెబుతోంది. సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్‌లతో సహా పలు అంతర్జాతీయ నగరాల్లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫర్‌కు సిడ్నీ మొదట ఆశ్చర్యపోయినా ప్రాజెక్ట్ ఆమెకు ఆసక్తికరంగా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఈ వార్తలపై సిడ్నీ స్వీనీ లేదా ఆ నిర్మాణ సంస్థ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాబట్టి, ఇది కేవలం ఊహాగానాలేనా లేక నిజంగానే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Sydney Sweeney
Sydney Sweeney