Aadi Saikumar | ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’. స్వాసిక హీరోయిన్. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. రాత్రివేళ ఓ పోలంలో ఎర్రచీర కట్టుకొని నిలబడ్డ ఓ స్త్రీ.
పక్కనే దిష్టిబొమ్మ.. మరోవైపు రాత్రివేళ ఎగురుతున్న పక్షులు.. భీతిని కలిగించే వాతావరణాన్ని సూచించేలా ఈ పోస్టర్ ఉంది. ఆ పొలంలో నిలబడ్డ స్త్రీ పేరు వసంత. ఆ పాత్రనే ఇందులో కథానాయిక స్వాసిక పోషిస్తున్నది. భయంకరమైన స్వాసిక లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆది సాయికుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఛాలెంజ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.