Sree Vishnu | టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను జూలై మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే స్వాగ్ గ్లింప్స్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా రేజర్ అంటూ కొత్త శ్రీవిష్ణు ఇంట్రో వీడియోను పంచుకుంది.
‘మగవాడంటే మీకేం గుర్తొస్తుంది’ అంటూ ముసలివాడి క్యారెక్టర్లో ఉన్న శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘రేజర్’ టీజర్ మొదలవుతుంది. ‘వేలెడంత పొగరు, వంశాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు’ అని చెప్పగానే ఒక విచిత్రమైన నవ్వుతో శ్రీ విష్ణు ఫేస్ రివీల్ అవుతుంది. ‘తాగుదామా ఇంకా’ అనే డైలాగ్‌తో శ్రీ విష్ణు స్వాగ్‌ను చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. ఇక ఈ వీడియో చూస్తుంటే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.
“Bhavabhuthi – The Face of the Male Pride” 🤟🧐
వంశాలైన, ఆస్తులైన, ఆడవాళ్ళైనా,
మగవాడినే అనుసరించాలి.Here’s #RAZOR🤟https://t.co/XDS1vgTYhP
TEASER ARRIVING 🔊
Get ready to witness the #SWAG steep 🔝SPERMING SOON.. 🤟#అచ్చతెలుగుసినిమా @hasithgoli @peoplemediafcy… pic.twitter.com/F921VYb3eg
— Sree Vishnu (@sreevishnuoffl) June 14, 2024