Ravikiran Kola | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా ఒక సినిమా చేస్తున్న విజయ్.. ఈ సినిమా అనంతరం దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాడు. SVC59 అంటూ వస్తున్న ఈ సినిమాకు రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) ఫేమ్ రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. గోదారి బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారికి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా.
ఈ సినిమా కోసం కొత్త నటినటులను తీసుకుంటున్నట్లు దర్శకుడు రవికిరణ్ కోలా తెలిపారు. యాక్టింగ్ వస్తే చాలు. తెలుగొస్తే సంతోషం…గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు అంటూ రవి కిరణ్ తెలిపాడు. నటన అంటే ఇష్టం ఉన్నవారు ఈ దరఖాస్తుకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ సినిమాకు అన్ని వయస్సుల వారు అర్హులే. మీ ప్రొఫైల్స్ ని SVC59casting@gmail.com మెయిల్‌కు లేదా వాట్సాప్ అయితే 9676843362 అనే నంబర్‌కు పంపగలరు అని దర్శకుడు తెలిపాడు. అలాగే ఇన్‌స్టా రీల్స్, సెల్ఫీ వీడియోలు పంపవద్దని తెలిపాడు.
Acting osthe chaaalu…😊
తెలుగొస్తే సంతోషం… 🤗
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు 🫡#SVC59 pic.twitter.com/8dUirEelhe— Ravi Kiran Kola (@storytellerkola) June 19, 2024