జాకీష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్యూజీ’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వివేక్ కుమార్ రూపొందించారు. గాయత్రి సురేష్ మరో నిర్మాత. ఈ సినిమాను రిషికేశ్వర్ ఫిల్మ్స్ ద్వారా ఎం.వేణుగోపాల్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ ‘హెవీ కాంపిటీషన్లో తెలుగు రైట్స్‌ని పొందడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సస్పెన్స్, థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుంది. జాకీష్రాఫ్ యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ బాత్మనబన్, సంగీతం: డ్రమ్స్ శివమణి.