రాజమౌళి సినిమాలు కొన్ని సంవత్సరాలుగా రూపొందుతుంటాయి. ఆ చిత్రాలు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటాయి.తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించాడు. ఈ చిత్రం రిలీజ్‌కి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కరోనా వలన వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఇటీవల జనవరి 7న రిలీజ్ కానుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా రిలీజ్‌తో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు అన్నీ పక్కకు తప్పుకుంటాయి అనుకున్నారు.అన్నీ చెప్పిన సమయానికే రిలీజ్ అవుతాయని తెలుస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రమే వాయిదా పడుతుందని సమాచారం.
‘ఆర్ ఆర్ ఆర్’కి సంబంధించి కొన్ని వందల సీజీ షాట్లను రాజమౌళి ఓకే చేయవలసి ఉందట. రాజమౌళి ఓకే చెప్పిన తరువాతనే ఆ సంస్థలు తమ వర్క్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకొని ఫస్టు కాపీ రావడం సంక్రాంతి నాటికి జరగదని అంటున్నారు. మార్చి లో మాత్రమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.కాగా, సంక్రాంతి బరిలో ముందుగా అంటే జనవరి 12న భీమ్లా నాయక్ తో పలకరించనున్నాడు పవన్. జనవరి 13వ తేదీన ‘సర్కారువారి పాట’ రానుంది. ఇక జనవరి 14వ తేదీన రానున్న ‘రాధే శ్యామ్ థియేటర్స్‌లోకి రానుంది.