Sushant Singh Rajput | సుశాంత్ 6వ వర్ధంతి.. ‘నువ్వు ఎప్పటికీ స్ఫూర్తివే’ అంటూ సోదరి శ్వేత ఎమోషనల్ పోస్ట్!
Sushant Singh Rajput | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి అప్పుడే ఆరేళ్లు అయిపోయింది. 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన ఇంట్లోనే సుశాంత్ చివరి శ్వాస విడిచారు.
Sushant Singh Rajput | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి అప్పుడే ఆరేళ్లు అయిపోయింది. 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన ఇంట్లోనే సుశాంత్ చివరి శ్వాస విడిచారు. అయితే ఆదివారం ఆయన 6వ వర్ధంతి సందర్భంగా.. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తమ్ముడు ఎలా చనిపోయాడనే విషయం కంటే, తను బతికినంత కాలం ఎంత గొప్పగా జీవించాడనే విషయాన్నే గుర్తుంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మనసులో జాలి, కరుణ లేనప్పుడు ఎంత పెద్ద విజయం సాధించినా దానికి అర్థం లేదనే విషయాన్ని సుశాంత్ అందరికీ నేర్పించాడని ఆమె గుర్తు చేసుకున్నారు.
సమయం ఎంత వేగంగా గడిచిపోయినా.. కొందరి జ్ఞాపకాలు కాలంతో పాటు ఇంకా పెద్దవవుతూనే ఉంటాయని శ్వేత రాసుకొచ్చారు. భాయ్ (సుశాంత్) గురించి ఆలోచించినప్పుడు.. చిన్నపిల్లల లాంటి అతని అమాయకత్వం, నక్షత్రాలు, విశ్వం, మనుషుల ఆలోచనల గురించి తెలుసుకోవాలనే అతని ఆరాటమే నాకు గుర్తొస్తాయి. ఎలాంటి బేధాలు చూపించకుండా అందరికీ సమానంగా గౌరవం ఇచ్చే మనసు అతనిది. మనిషి మన కళ్ల ముందు లేకపోయినా, వారు చూపించిన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఎవరైనా సరే కోపాన్ని వదిలేసి ప్రేమగా ఉన్నప్పుడు, అజ్ఞానాన్ని వీడి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు భాయ్ ఆశయాలు బతికే ఉంటాయి. సుశాంత్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి బాధపడటం కాదు.. అతను నమ్మిన జిజ్ఞాస, దయ, భయం లేకుండా కలలు కనడం వంటి మంచి అలవాట్లను మన జీవితంలో అలవర్చుకోవడమే. మనం ఎంతకాలం బతికాం అనేదానికంటే, ఎంతమంది హృదయాల్లో నిలిచాం అనేదే ముఖ్యం. ఆ లెక్కన భాయ్ ఎప్పటికీ బతికే ఉంటాడు. నువ్వు ఎప్పటికీ కోట్లాది మందికి స్ఫూర్తివే భాయ్ అంటూ శ్వేత భావోద్వేగంగా తన పోస్ట్‌ను ముగించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

