సూర్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. మే 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించనున్నారు. సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ కలబోతగా సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, కథలోని సామాజిక సందేశం ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. త్రిష, ఇంద్రన్, నట్టి, స్వాసిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.