Suryakantham| ఇప్పటి వారికి సూర్యకాంతం అంటే పెద్దగా తెలియకపోవచ్చు కాని, ఆ నాటి తరం వారికి సూర్య కాంతం చాలా సుపరిచితం. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, గయ్యాళి అత్త ఇలా సూర్యకాంతంని పిలుచుకుంటారు. ఆమె తుది శ్వాస వరకు నటిస్తూనే ఉంది. సూర్యాకాంతం 1924 అక్టోబర్ 28న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటరాయపురంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన సూర్యకాంతం.. పెద్దక్క, బావల దగ్గర పెరిగి, ఆ తర్వాత సినిమాలపై ఇష్టంతో తన తల్లిని వెంటబెట్టుకొని మద్రాసు వెళ్లింది. 1946లో వచ్చిన నారదనారది సినిమాలో తొలిసారిగా నటించింది సూర్యకాంతం.
1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ సినిమాతో గయ్యాళి పాత్రలకు సూర్యకాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారారు.హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావును 1950లో సూర్యకాంతం పెళ్లిచేసుకున్నారు. సూర్యకాంతం చివరిగా ‘ఎస్పీ పరశురాం’ సినిమాలో నటించారు.భానుమతి నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం తప్పకుండా కనిపించేవారు.అయితే సూర్యకాంతం గయ్యాళితనం అంతా సినిమాలలోనే. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా హుందాగా ఉంటారు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానామాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. దాంతో ఆయన కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పింది. అంత మంచి మనసున్న మనిషి.
అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలు నటించిన ఆ సినిమాకి ‘గుండమ్మ కథ’ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతంకి అందరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్ధమవుతుంది.అయితే ఓసారి సూర్యకాంతం కారులో పోతుంటే ఓ గ్రామం దగ్గర కారు ఆగింది. అప్పుడు ఓ మహిళ సూర్యకాంతం దగ్గరకు వచ్చి, ఏం తల్లి సినిమాలలో ఎంత మంది కాపురాలు కూల్చుతావు, ఎంత మందిని విడగడతావు , ఇంకో పని లేదా హాయిగా కారులో తిరుగుతున్నావ్.. ఎంత మంది ఉసురు పోసుకుంటావు అని ఆ మహిళ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకడంతో భయపడిపోయిందట సూర్యకాంతం.