Direction | పలు విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు ఎస్.జె. సూర్య ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా అలరించబోతున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కిల్లర్’ కోసం మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య నటిస్తూనే కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అన్నీ తనే అందించనున్నారు.‘కిల్లర్’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ మరియు ఎస్.జె. సూర్యకు చెందిన ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వి.సి. ప్రవీణ్, బైజు గోపాలన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ఎస్.జె. సూర్య, ఇప్పుడు ‘కిల్లర్’తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ను ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ‘కిల్లర్’ను రూపొందిస్తున్నాం. టాలెంటెడ్ నటీనటులు, టాప్ టెక్నిషియన్లతో కలిసి ఎమోషనల్గా, వినోదాత్మకంగా, వినూత్నంగా ఉండే చిత్రాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని నిర్మాతలు వెల్లడించారు.
ఈ సినిమా కథా నేపథ్యం, తారాగణం, సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. తనదైన శైలితో ఆసక్తికరమైన కథలను అందించడంలో ఎస్.జె. సూర్య స్పెషలిస్ట్ ‘కిల్లర్’ సినిమాతో ఆయన మళ్లీ దర్శకుడిగా ఎలా మెప్పిస్తారో చూడాల్సిందే. మరోవైపు శ్రీ గోకులం మూవీస్ సంస్థ ప్రస్తుతం మలయాళంలో ‘ఒట్టకొంబన్’ (సురేశ్ గోపీ), ‘కథనార్’ (జయసూర్య), ‘భా భా బా’ (దిలీప్) వంటి సినిమాలను నిర్మిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా కిల్లర్ తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా కిల్లర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఈ చిత్రంతో సూర్య మళ్లీ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశాలున్నాయి.