SuryaSethupathi | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ స్పెషల్ స్టార్డమ్ సంపాదించిన అతికొద్ది మంది హీరోల జాబితాలో టాప్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి నటవారసుడు తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి (Vijay Sethupathi) హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు.
Phoenix టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛ్ కానుంది. ఈ చిత్రాన్ని సీనియర్ స్టంట్ కొరియోగ్రఫర్ Anl Arasu దర్శకత్వం వహిస్తుండటం విశేషం. డైరెక్టర్‌గా ఈయనకు కూడా ఇది డెబ్యూ ప్రాజెక్ట్. Anl Arasu కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2, ఇటీవలే బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన జవాన్ సినిమాలకు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేశాడు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న Phoenix చిత్రానికి ఖిలాడి కంపోజర్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి అరశకుమార్ ఈ చిత్రాన్ని నిర్మి్స్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన Naanum Rowdy Thaan, Sindhubaah చిత్రాల్లో చైల్డ్ యాక్టర్‌గా నటించాడు సూర్య సేతుపతి. అప్‌కమింగ్ యాక్షన్ డ్రామా Viduthalai 2లో కూడా నటిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా అందరినీ మెప్పించిన సూర్య సేతుపతి.. మరి హీరోగా ఎలాంటి క్రేజ్ సంపాదిస్తాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Vijay Sethupathi’s son Surya Sethupathi debuts as Hero in #Phoenix 💥
[Appuram Ennaba.. NEPOTISM nu sollitu oru group ipo kelambirukanume…💀] pic.twitter.com/jwceOHDuQn
— Christopher Kanagaraj (@Chrissuccess) November 24, 2023
#VijaySethupathi son #SuryaVijaySethupathi will debut as a lead hero in Stunt choreographer #ANLArasu‘s Directorial debut #Phoenix pic.twitter.com/XCpWLIq75d
— Prakash Mahadevan (@PrakashMahadev) November 24, 2023
.@VijaySethuOffl ‘s son #SuryaVijaySethupathi Doing As Lead Titled As #Phoenix…
Written & Directed By #AnalArasu… pic.twitter.com/RJUsQTHyT1— Rajasekar Russalayan (@iamrajesh_pov) November 24, 2023
‘அப்பா வேற… நான் வேற…’ தமிழ் திரையுலகில் அறிமுகமாகும் விஜய் சேதுபதி மகன் சூர்யா பேட்டி..!#ActorVijaySethupathi | #SuryaSethupathi | #Phoenix pic.twitter.com/6pWYkS4Cy4
— Polimer News (@polimernews) November 24, 2023