ET movie trailer | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గజిని నుండి జై భీమ్ వరకు ఈయన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈటి:ఎవ్వరికి తలవంచడు’. ‘చినబాబు’ ఫేం పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డి.ఇమ్మమ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
‘వాడేమో సైంటిస్ట్ కావాలని ఆశపడ్డాడు..నేనోమో వేరే విధంగా అవ్వాలని ఆశపడ్డాను..కాలం, దైవం వాన్ని ఇలా చూడాలని ఆశపడింది’ అంటూ ట్రైలర్ మొదలవ్వగా ‘సంతోషంలో గొప్ప సంతోషం ఏంటంటే ఇతరులను సంతోషపెట్టడమే అనే దానికి ఇది త్రివిక్రమ్ డైలాగ్ల ఉందే’ అంటూ వచ్చే సంభాషణలు నవ్వులు పూయిస్తుంది. ‘ఈ ఊరికి నోరు మాత్రమే ఉంటుంది, చెవులు ఉండవు’ అంటూ ప్రియాంక చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘అమ్మాయిలంటే బలహీనులు అనుకుంటారు..కాదు బలవంతులు అని నిరూపించాలి’ వంటివి స్త్రీల పట్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే సామాజిక పోరాట యోదుడిగా సూర్య పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.