Surya | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షను సాధిస్తుంటాయి. ఈయన నటించిన గత రెండు సినిమాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈయన ఈటీ చిత్రంలో నటిస్తున్నాడు. పాండీరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలో సూర్య డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూర్య ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ పనులను మొదలుపెట్టాడు. ఈయన మొదటిసారిగా తన గొంతుతో తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. డి. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
A pakka treat for Telugu fans as@Suriya_offl dubs in his own voice for the Telugu version of #ET 👌👍 #EtharkkumThunindhavan @pandiraj_dir @sunpictures #Suriya pic.twitter.com/TuddNfHWzW
— Kaushik LM (@LMKMovieManiac) February 12, 2022