రజత్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సర్వైవర్’. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్ కూడా ఆయనే కావడం విశేషం. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ట్రైలర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డులను అందుకున్న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నది.
ఈ సందర్భంగా రజత్ రజనీకాంత్ మాట్లాడుతూ ‘నేను చేసిన ప్రతి సినిమాకూ అవార్డులు వరించాయి. ఇందులో ‘సర్వైవర్’ ప్రత్యేకం. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలందాయి. కథ, యాక్షన్ ఎపిసోడ్స్, నటన అన్నీ బాగా కుదిరాయి. ఇప్పుడు ఓటీటీలో కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ వల్ల ఇక ముందు మంచి సినిమాలు చేయడానికి బలం చేకూరింది’ అని చెప్పారు.