Thammudu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలిసిందే. అభిమానులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వారిలో జోష్ నింపుతున్నాడు. పవన్ కల్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుంది తమ్ముడు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హిట్ సినిమాలైన తమ్ముడు, జల్సా థియేటర్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతున్నాయని తెలిసిందే. వీటిలో మొదట తమ్ముడు సెప్టెంబర్ 2న రీరిలీజ్‌కు సిద్ధమైంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తమ్ముడు రెండు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 30నే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ లెక్కన తమ్ముడు కోసం చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో రెండు రోజులు కలిసొచ్చాయన్నమాట. తాజా అప్డేట్ ఇక ఇప్పటి నుంచే ఆ రోజు ఎప్పుడొస్తుందా అని అభిమానులు లెక్కపెట్టుకుంటున్నారట. పీఏ అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాడు.
బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ప్రీతి జంగియాని, అదితీ గోవిథ్రికర్, అచ్యుత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమ్ముడు సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆల్ టైం ఫేవరేట్ హిట్ లిస్టులో ఉంటాయని తెలిసిందే.
The birthday celebrations kick off 2 days early with #Thammudu💥
Power Star @PawanKalyan’s #ThammuduReRelease on Aug 30th!❤️🔥#Thammudu4K presented by @MangoMassMedia #PreetiJhangiani #AditiGovitrikar #PAArunPrasad #RamanaGogula #SriVenkateswaraArtFilms #jmediafactory pic.twitter.com/8wXRbJU6TV— JMediaFactory (@JMedia_Factory) August 18, 2025
Mandaadi | ఈ సారి తగ్గేదేలే అంటున్న సుహాస్.. హైప్ పెంచుతోన్న మండాడి స్పెషల్ పోస్టర్
War 2 | కూలీ చిత్రాన్ని అందుకుంటుందా..? తారక్, హృతిక్ రోషన్ వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఇవే
Shruti Haasan | నంబర్ గేమ్ కొత్త సమస్య.. కమల్ హాసన్ థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్