బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 5 మచ్ ఎంటర్టైన్మెంట్, 5 మచ్ మస్తీ, 5 మచ్ ఎమోషన్స్ ఇలా 5 మచ్ వినోదాన్ని పంచుతూ వచ్చింది. సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా, డిసెంబర్ 19న ఫినాలే ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 19న జరుగనున్న గ్రాండ్ ఫినాలే ఈ సారి నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట.
గత రెండు సీజన్స్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా, ఈ సారి మాత్రం బాలీవుడ్ స్టార్స్‌ని కూడా దింపబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్టీమ్ నుంచి రామ్‌చరణ్, అలియాభట్,
83` సినిమా నుంచి రణ్వీర్ సింగ్, దీపికా గెస్ట్ లుగా రాబోతున్నారని అంటున్నారు. ఈ షోలో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలని కూడా రణ్వీర్, దీపికా టీమ్ భావిస్తుందట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇక గ్రాండ్ ఫినాలేకు ఈ నలుగురు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హాజరు కానుండగా, కప్ ఇచ్చేందుకు మరో గెస్ట్ వస్తారా అనే దానిపై కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైన ఈ సారి ఫినాలే కార్యక్రమాన్ని చాలా రిచ్‌గా చేయాలనే ప్లాన్‌తో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తుంది.