Kanguva Movie | కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసింది ఈయనే. ఇక ఇప్పుడు సూర్యతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ జూలై 23న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. కాగా తాజాగా కంగువ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. శనివారం మధ్య రాత్రి 12:01 నిమిషాలకు ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు. పోస్టర్లో ఒక మనిషి, అడవి, కథ అంటూ సూర్య కళ్ల వరకు ఫేస్‌ను రివీల్ చేశారు. నుదుటి పైన, కన్నుబొమ్మ చుట్టుపక్కల కత్తి గాట్లతో సూర్య ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఖడ్గం కంటే తన కళ్లే పదునైనవి అంటూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళం నుంచి తొలి వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్టూడీయో గ్రీన్ బ్యానర్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమానూ నిర్మిస్తుంది. సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దీశా పటానీ నటిస్తుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతన్నాడు.
His eyes sharper than the sword! 🗡️
The King arrives 👑#GlimpseOfKanguva from 23rd July, 12:01 AM @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth @KanguvaTheMovie#Kanguva 🦅 pic.twitter.com/vLNXy4OxQ3
— UV Creations (@UV_Creations) July 22, 2023