Kanguva | తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. అయితే ఈ మూవీ నిర్మాతకు తాజాగా షాక్ తగిలింది.
ఈ మూవీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై మద్రాస్ హైకోర్ట్‌లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. కేఈ జ్ఞానవేల్ రాజా దాదాపు రూ.100 కోట్లు బకాయి పడ్డాడని ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హైకోర్టులో కేసు నమోదు చేసింది. మాకు బకాయిలు చెల్లించిన తర్వాతే తన కంగువ సినిమాను విడుదల చేయాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు నవంబర్ 07న వాదానలు వినేందుకు అంగీకరించినట్లు సమాచారం.