Jana Nayagan | సూర్యతోపాటు థియేటర్లలోకి విజయ్.. జననాయగన్ రిలీజ్ డేట్ ఫిక్సయినట్టేనా..?
Jana Nayagan | మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 9నే జన నాయగన్ (Jana Nayagan) వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో విడుదల డైలమాలో పడిపోయింది..
Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) కాంపౌండ్‌నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో విడుదల కానుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 9నే ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో విడుదల డైలమాలో పడిపోయింది..
సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన బావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆర్మీ దళాలను సమస్యాత్మక కోణంలో చూపించారని సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయలేదు. ఈ మూవీ రివైజింగ్ కమిటీ ముందు స్క్రీనింగ్ అయిన తర్వాత రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్టేనన్న వార్త ఒకటి నెట్టంట వైరల్ అవుతోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం జననాయగన్‌ను మే 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మే 8వ తేదీని కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే రోజున సూర్య నటించిన కరుప్పు కూడా రాబోతుందని తెలిసిందే. మొత్తానికి ఇదే నిజమైతే ఓ వైపు సూర్య, మరోవైపు విజయ్.. ఇద్దరు స్టార్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
సెన్సార్ షిప్ సమస్యల కారణంగా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియో జననాయగన్ ఓటీటీ డీల్‌ను రద్దు చేసుకుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లైన్లో ఉండబోతున్న ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీ రోల్ చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Exclusive : #JanaNayagan Planning May 8 or May 14 Release 🔥 pic.twitter.com/cGuG4tHSFx
— Ayyappan (@Ayyappan_1504) April 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

