కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్(puneet raj kumar) మృతితో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిన విషయం తెలిసిందే. ఆయన లేడనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ హఠాత్మరణం చెందడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షాక్‌లో ఉండిపోయారు.
పునీత్ మరణించిన సమయంలో వేరే పనులతో బిజీగా ఉండి రాలేని వారు ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. తాజాగా నటుడు సూర్య(suriya) డైరెక్ట్‌గా పునీత్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు.ఆయన లేడనే విషయం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.
పునీత్ మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ పార్థీవదేహాన్ని చూడలేకపోయిన ఆయన.. తాజాగా పునీత్ ఇంటికి వెళ్లారు.
#Suriya paid his respects to Late #PuneethRajkumar at Bengaluru#ripPuneethrajkumar @Suriya_offl pic.twitter.com/oEx3lvCt8v
— Actor Kayal Devaraj (@kayaldevaraj) November 5, 2021