Karuppu Movie | తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటులలో కథానాయకుడు సూర్య (Suriya) ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలవుతుంది. అంతేకాదు, వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకి అట్లూరితో సినిమా చేస్తున్న సూర్య తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్య 45గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాకు కరుప్పు (నలుపు) అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
Here’s our #Karuppu for you..!
Wishing you all happiness @RJ_Balaji #கருப்பு@trishtrashers @dop_gkvishnu @SaiAbhyankkar @natty_nataraj #Indrans #Swasika @prabhu_sr@DreamWarriorpic pic.twitter.com/a7YQ3l0NS7— Suriya Sivakumar (@Suriya_offl) June 20, 2025
Read More