Karuppu | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ సూర్య (Suriya). కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సూర్య. కరుప్పు (Karuppu) టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు. మాస్ అండ్ మ్యూజిక్‌తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ ఉండండి. కరుప్పు ఫస్ట్ సాంగ్ దీపావళి కానుకగా అక్టోబర్ 20న వస్తోందని తెలియజేస్తూ సూర్య తన చేతిలో ఓ ఆయుధం పట్టుకున్న లుక్ షేర్ చేశారు. ఫస్ట్ సింగిల్ మాస్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు ఈ లుక్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డ్రీమ్ వారియర్పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
కరుప్పు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. డిజిటల్ రైట్స్ డీల్ కుదుర్చుకోవడంలో ఆలస్యం కారణంగా విడుదల తేదీపై డైలామా నెలకొందంటూ వార్తలు తెరపైకి రాగా.. ఈ డైలమాకు డైరెక్టర్ ఆర్జే బాలాజీ చెక్ పెట్టాడు.
సినిమా దాదాపు పూర్తయింది. దీపావళి విడుదలకు ప్లాన్ చేశాం. సీజీ వర్క్ కారణంగా ఆలస్యమవుతుంది. నాతోపాటు నిర్మాతలు చాలా ప్రేమతో మనసు పెట్టి చేస్తున్న సినిమా ఇది. దీపావళికి ఫస్ట్ సాంగ్ వస్తుంది. సూర్య సార్ తన డ్యాన్స్‌తో సెగలు పుట్టించడం ఖాయమన్నాడు ఆర్జే బాలాజీ.
Get ready for a Deepavali filled with mass and music 💥
The FIRST SINGLE from #Karuppu drops on Oct 20!@Suriya_offl ‘s #Karuppu
A @RJ_Balaji Film
A @SaiAbhyankkar musical. #KaruppuFirstSingle🔥#Diwali @trishtrashers #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl… pic.twitter.com/V2hYHwr8FO— Think Music (@thinkmusicindia) October 18, 2025