తమిళ నటుడు వివేక్ శనివారం తెల్లవారు జామున 4.35 గంటలకు గుండె పోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. కమెడీయన్‌గా, హోస్ట్‌గానే కాకుండా మంచి మానవత్వం ఉన్న మనిషిగా, సామాజిక కార్యకర్తగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు వివేక్. ఆయన మృతికి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్స్ నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా నటుడు సూర్య, ఆయన సోదరుడు కార్తీ, సతీమణి జ్యోతిక, హీరో విక్రమ్, దర్శకుడు శంకర్ .. వివేక్ ఇంటికి వెళ్లి ఆయన పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. వివేక్ మరణ వార్త ఎంతో కలిచివేసిందని ఆయన మృతి కోలీవుడ్‌కు తీరని లోటు అని వారు పేర్కొన్నారు. దర్శక దిగ్గజం శంకర్ తన ట్విట్టర్ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియజేశారు. ఈ రోజు మంచి నటుడు, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, ప్రకృతి ప్రేమికుడిని కోల్పోయాము. నా సినిమాలతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు పద్మశ్రీ వివేక్ చేసిన సేవలు చాలా పెద్దవి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని శంకర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Shankar, Suriya, Karthi, Jyothika, Vikram pays last respects to actor #Vivek#RipVivek pic.twitter.com/ZrTCkYpjD5
— BA Raju's Team (@baraju_SuperHit) April 17, 2021
Today we lost an amazing actor, wonderful human being and lover of nature:Padma Shri Vivek.
— Shankar Shanmugham (@shankarshanmugh) April 17, 2021
His contributions to my films, Tamil Film Industry and to society is immeasurable, so is this loss. May his soul Rest In Peace 🙏
My heartfelt condolences to his family, friends and fans.