Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య 42 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కంగువ (Kanguva) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవలే లాంఛ్ చేసిన కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం సూర్య టీం కంగువ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కంగువ కొత్త షెడ్యూల్ ఇవాళ కేరళలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 50 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది.
సూర్య, దిశాపటానీ, ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను తాజా షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో సందడి చేయబోతుంది కంగువ. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్య మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023