Suriya Fans Passed Away | రజనీ, కమల్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు సూర్య. టాలీవుడ్లో ఆయన్ను అడాప్టెడ్ సన్గా పిలుస్తుంటారు. కోలీవుడ్లో సూర్యకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో.. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో ఉంది. తాజాగా ఆ అభిమానమే ఇద్దరూ ప్రాణాలను బలి తీసింది. ఆదివారం సూర్య బర్త్డే సందర్భంగా టాలీవుడ్లోని ఆయన ఫ్యాన్స్ ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరుపుకుంటున్నారు. కాగా వేడుకల్లో భాగంగా ఇద్దరు అభిమానులు సూర్య ఫ్లెక్సీ కడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారు.
ఆంద్ర ప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కట్టుబడిపాలెంలో నక్కా వెంకటేశ్, పోలూరు సాయి శనివారం అర్ధరాత్రి నటుడు సూర్య ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీకి ఉన్న ఐరన్ ఫ్రేమ్.. పక్కనున్న విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుత్ షాక్కు గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. చనిపోయిన ఇద్దరు యువకులు డిగ్రీ సెకండియర్ చదువుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.