సురేష్ ప్రొడక్షన్స్ మినీ (ఎస్పీ మిని) సమర్పణలో రాబోతున్న రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ఆనందలహరి’. అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబికా టుటిక ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి వనపల్లి దర్శకత్వంలో ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. గోదావరి నేపథ్యంలో సాగే చక్కటి కుటుంబ కథా చిత్రమిదని, రొమాన్స్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.