బాలీవుడ్లో ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు సూరజ్ భర్తాజ్యా. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌తో ఆయన రూపొందించిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. చిత్రాలు చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలన్నింటిలో సల్మాన్‌ఖాన్ ప్రేమ్ అనే పాత్రలోనే కనిపించడం విశేషం. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నది.
ఈ విషయాన్ని దర్శకుడు సూరజ్ భర్తాజ్యా ‘ఊంఛాయి’ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. దీనికి ‘ప్రేమ్ విల్ రిటర్న్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ..ప్రేమ్ తిరిగొచ్చిన తర్వాత ఈసారి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చమత్కరించారు. తమ ఇద్దరి కాంబినేషన్లో మరో గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మిగిలిపోతుందని సల్మాన్‌ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.