Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 37 రోజులు జైలు జీవితం గడిపిన జానీ మాస్టర్‌కు అక్టోబరు 24న
రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.
అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.