వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది ‘జైలర్-2’. ఈ సినిమాతో కెరీర్లో మళ్లీ పుంజుకున్నారాయన. బాక్సాఫీస్ వద్ద 600కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా తమిళనాట బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘జైలర్-2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. మంగళవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించిన రజనీకాంత్ ‘జైలర్-2’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
వచ్చే ఏడాది జూన్ 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు. డిసెంబర్‌లోగా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని, ఐదు నెలలు పోస్ట్‌ప్రొడక్షన్ కోసం కేటాయిస్తున్నామని, ఎక్కువ సమయం ఉన్నందువల్ల క్వాలిటీ అవుడ్పుట్ను తీసుకురావొచ్చని రజనీకాంత్ తెలిపారు. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలిభాగంలో నటించిన శివరాజ్‌కుమార్, మోహల్‌లాల్ లతోపాటు టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ కూడా ఈ సీక్వెల్లో కనిపించనున్నారు.