Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు రజినీ తరఫు న్యాయవాది పబ్లిక్ నోటీస్ జారీ చేశారు.
రజినీకాంత్ ఒక సెలబ్రెటీ కాబట్టి.. ఆయన పేరు, ఫొటో, డైలాగులు లేదా ఇంకా ఏవైనా ప్రత్యేకతలను అనుమతి లేకుండా ఉపయోగించి కొంతమంది వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నారు. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. రజినీకాంత్‌కు ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉంది. ఆయన ప్రతిష్ఠకు లేదా వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తే దాని వల్ల ఆయనకు ఎంతో నష్టం కలుగుతుంది. అని ఆ నోటీసులో రజినీకాంత్ న్యాయవాది ఎలంభారతి పేర్కొన్నారు. ఇలా ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మొదలగు ఆయన ప్రత్యేకతలను అనుమతి లేకుండా వినియోగిస్తే సెలబ్రెటీ హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రజినీకాంత్ విడుదల చేసిన ఈ నోటీసు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.