సామాన్యులతో సూపర్స్టార్ ప్రయాణం
మిగతా హీరోలతో పోల్చి చూస్తే రజనీకాంత్ జీవనశైలి భిన్నం. వయసు మీద పడుతున్నా కుర్రాళ్లలా కనిపించడానికి చాలామంది హీరోలు ప్రయత్నిస్తుంటారు.
మిగతా హీరోలతో పోల్చి చూస్తే రజనీకాంత్ జీవనశైలి భిన్నం. వయసు మీద పడుతున్నా కుర్రాళ్లలా కనిపించడానికి చాలామంది హీరోలు ప్రయత్నిస్తుంటారు. రజనీ అలాకాదు. ఇంట్లో ఎలా ఉంటారో, బయటా అలాగే ఉంటారు. తలకు రంగేయడం, వయసు దాచేయడం ఆయన హిస్టరీలో లేదు. రజనీ పారితోషికం వందకోట్ల పైమాటే. కానీ లగ్జరీలకు పోరు. సామాన్యుడిగా బతకడం.. అందరినీ ఆప్యాయంగా పలకరించడం రజనీైస్టెల్. రీసెంట్గా చెన్నయ్ నుంచి కడపకు సాధారణ ప్రయాణికుడిగా ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు రజనీ. ఆ విమానంలో రజనీని చూసిన జనం సంతోషంతో పొంగిపోయారు.
తలైవాను దగ్గరగా చూస్తూ తెగ సంబరపడిపోయారు. ఆయనేమో అవేమీ పట్టించుకోకుండా ఎయిర్ పాడ్స్ పెట్టుకొని సంగీతాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ తలైవాకు కడపలో పనేంటి? అనుకుంటున్నారా..? టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న తాజా చిత్రం ‘x షూటింగ్ ప్రస్తుతం కడపలో జరుగుతున్నది. ఆ షూటింగ్ నిమిత్తం ఆయన కడప వెళ్లారు. ఇక ‘వెట్టయాన్’ విషయానికొస్తే.. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ఇందులో కీలక పాత్రధారులు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రయూనిట్ పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమా ‘వేటగాడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

