నటుడిగా గొప్ప పేరుప్రతిష్టల్ని సంపాదించుకున్నా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషం కరువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆరోగ్యం అత్యంత విలువైనదని, అది కోల్పోతే మన ఆత్మీయుల్ని బాధపెట్టిన వాళ్లమవుతామని ఆయన చెప్పారు. చెన్నైలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు.
సినీ కెరీర్లో శ్రీ రాఘవేంద్ర, బాబా సినిమాలు గొప్ప ఆత్మ సంతృప్తినిచ్చాయని, బాబా సినిమా చూసిన చాలా మంది అభిమానులు హిమాలయాల్లోకి వెళ్లి సన్యాసులుగా మారిపోయారని రజనీకాంత్ గుర్తు చేశారు. ‘నా జీవితంలో విజయాలతో పాటు డబ్బు , పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా.
అన్నీ ఉన్నా నా జీవితంలో పదిశాతం సంతోషం, ప్రశాంతత పొందలేకపోయా’ అని రజనీకాంత్ తాత్వికధోరణిలో మాట్లాడారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు.