కాలం ఎవరిని ఏ శిఖరాలకు చేర్చుతుందో, ఎప్పుడు అగాధాల్లోకి నెట్టివేస్తుందో ఎవరూ ఊహించలేరని తాత్విక ధోరణిలో వ్యాఖ్యానించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇటీవల చెన్నైలో ప్రసిద్ధ థియేటర్ ఆర్టిస్ట్ వైజీ మహేంద్రన్ ‘చారుకేశి’ నాటకం 50 ఏండ్ల వేడుకలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ నాటకాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా వైజీ మహేంద్రన్ తండ్రి వైజీ పార్థసారథి 70వ దశకంలో వేసిన ఓ నాటకాన్ని చూడటానికి తాను వెళ్లగా అక్కడ ప్రవేశం దొరకలేదని రజనీకాంత్ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘అప్పటికే నేను ‘అపూర్వరాగంగల్’ (1975) చిత్రంలో చిన్న పాత్రలో నటించాను.
కాస్త గుర్తింపు కూడా దక్కింది. ఒకరోజు మిత్రుడు కన్మణి సుబ్బుతో కలిసి వైజీ పార్థసారథి నటిస్తున్న ఓ నాటకాన్ని చూడటానికి వెళ్లాను. దానికి నా గురువు బాలచందర్‌గారు దర్శకుడు. ఆర్టిస్టునని గుర్తించకుండా నన్ను గేటు దగ్గరే ఆపేశారు. ప్రవేశం లేదని ఖరాఖండిగా చెప్పారు. ఇక వెనుదిరిగి పోదామనుకుంటున్న తరుణంలో ఓ కాస్ట్యూమ్ డిజైనర్ నన్ను గుర్తుపట్టి లోపలికి రానిచ్చారు. ఇప్పుడు అదే నాటకం యాభై సంవత్సరాల వేడుకకు నేను అతిథిగా రావడం విధి మహిమే అనుకుంటున్నా’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇదే వేదికపై ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడారు. మందు, సిగరెట్లు, మాంసాహార ం..ఈ మూడు ఆరోగ్యాన్ని పాడు చే సే భయంకరమైన కాంబినేషన్ అని రజనీకాంత్ పేర్కొన్నారు.