Superman Trailer | DC కామిక్స్ నుంచి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ఐదుకి పైగా సినిమాలు విడుదల కాగా.. తాజా మరో చిత్రం రాబోతుంది. జేమ్స్ గన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు క్లార్క్ కెంట్ సూపర్‌మ్యాన్‌గా నటిస్తుండగా, లోయిస్ లేన్‌గా రాచెల్ బ్రోస్నాహన్ మరియు లెక్స్ లూథర్‌గా నికోలస్ హౌల్ట్ కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో హాక్గర్ల్గా ఇసాబెలా మెర్సెడ్, గ్రీన్ లాంతర్న్గా నేథన్ ఫిలియన్, మిస్టర్ టెర్రిఫిక్‌గా ఎడి గతేగి, మెటామార్ఫోగా ఆంథోనీ కారిగన్, ది ఇంజనీర్‌గా మరియా గాబ్రియేలా డి ఫారియా, జిమ్మీ ఓల్సెన్గా స్కిలర్ గిసోండో, ఈవ్ టెష్మాచర్గా సారా సంపైయో, పెర్రీ వైట్‌గా వెండెల్ పియర్స్, జోనాథన్ కెంట్గా టేలర్ విన్స్ మరియు మార్తా కెంట్గా నేవా హోవెల్ నటిస్తున్నారు.
ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్లో జూలై 11 విడుదల కానుండగా.. అంతర్జాతీయంగా జూలై 9 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఆశలు రేకెత్తించే, మనుషుల మీద నమ్మకం కలిగించే మంచి కథలా అనిపిస్తోంది. క్లార్క్ కెంట్, సూపర్‌మ్యాన్ పాత్రలో డేవిడ్ కోరెన్స్వెట్ బాగా సూటవుతున్నాడు. లోయిస్ లేన్‌గా రాచెల్ బ్రోస్నాహన్ చాలా తెలివైన అమ్మాయిలా ఉంది. ఇక లెక్స్ లూథర్‌గా నికోలస్ హౌల్ట్ భయానకమైన విలన్లా కనిపించబోతున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సీన్లు, విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా కొత్త DC యూనివర్స్‌కు మంచి ప్రారంభం ఇస్తుందనిపిస్తోంది.