ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హను-మాన్’. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా సొషియోఫాంటసీ చిత్రంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్నాడు. గౌరహరి, అనుదీప్‌దేవ్, కృష్ణ సౌరభ్ కలిసి స్వరాలందించిన ఈ చిత్రంలోని ఓ పాటను మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ‘సూపర్‌హీరో హనుమాన్..’ అంటూ సాగే ఈ పాట సంగీత పరంగానే కాక, విజువల్ ప్రెజెంటేషన్ కూడా అద్భుతంగా ఉంటుందని, సూపర్‌హీరోలను ఇష్టపడే పిల్లలకోసం నిజమైన సూపర్‌హీరో హనుమాన్ సూపర్ పవర్ చూపించటానికే బాలల దినోత్సవం రోజు ఈ పాటను విడుదల చేశామని మేకర్స్ చెప్పారు. జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలోనే కాక ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వినయ్‌రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, నిర్మాత: కె.నిరంజన్‌రెడ్డి.