ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అన్నింట్లోనూ ఫస్ట్..సాక్ష్యాలు ఇవే
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతీ సినిమా అందులోనే వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక్క సినిమాపై కోటి రూపాయలు ఖర్చు చేయాలంటే ఆలోచించేవాళ్ళు

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతీ సినిమా అందులోనే వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక్క సినిమాపై కోటి రూపాయలు ఖర్చు చేయాలంటే ఆలోచించేవాళ్ళు. అలాంటి సమయంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా ఒక్కో సినిమా కోసం కోట్లు ఖర్చు చేసారు సూపర్ స్టార్ కృష్ణ. లక్షల్లో ఉన్న తెలుగు సినిమా బడ్జెట్ ను కోట్లలోకి తీసుకెళ్లారు. ఇంకా ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు. తెలుగులో ఈయన సాహసి.
టాలీవుడ్ ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఆయనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో..? టాలీవుడ్ టార్చ్ బేరర్ సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు.. సాహసాలు మరే హీరో చేయలేదేమో..? తెలుగులో తొలి స్కోప్ సినిమా.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా.. తొలి డీటీఎస్ సినిమా.. తొలి 70ఎంఎం సినిమా.. తొలి కౌబోయ్ సినిమా.. తొలి స్పై సినిమాని చేసింది ఆయనే.
- తొలి 70 ఎంఎం సినిమా: సింహాసనం (1986)
- తొలి కౌబాయ్ సినిమా: మోసగాళ్లకు మోసగాడు (1971)
- తొలి సోషల్ కలర్ సినిమా: తేనె మనసులు (1965)
- తొలి ఫుల్జీ కలర్ సినిమా: భలే దొంగలు (1976) (Credits: You Tube)
- తొలి ORW కలర్ సినిమా: గూడుపుఠానీ (1972)
- తొలి RO సినిమా: కొల్లేటీ కాపురం (1976)
- తొలి ఔట్ డోర్ షూటింగ్ సినిమా, తొలి స్కోప్ టెక్నోవిజన్ సినిమా: సాక్షి (1967)
- తొలి స్కోప్ సినిమా: అల్లూరి సీతారామరాజు (1974)
- తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా: ఈనాడు (1982)
- తొలి డిటిఎస్ సినిమా: తెలుగు వీర లేవరా (1995)
- తొలి స్పై సినిమా: గూఢచారి 116 (1966)
- ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ సొంతం. 1972లో ఈయన 18 సినిమాల్లో నటించాడు. దానికి ముందు 1971లో 11, 1970లో 16 సినిమాలు విడుదల చేసాడు.
- 1983లో ఒకే నెలలో తక్కువ వ్యవధిలోనే విడుదలైన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. 4 సెంటర్లలో నేరుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. సెప్టెంబర్ 1983లో శక్తి, ప్రజారాజ్యం సినిమాలు ఈ రికార్డులు తిరగరాసాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు ఏ హీరోకు కూడా సాధ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

