Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్ హస్సిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులు కృష్ణ హాస్పిటల్లోనే చికిత్స తీసుకోనున్నాడు. కృష్ణ హెల్త్ కండీషన్ క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2019లో కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా కృష్ణ ఇంట్లో వరుసగా విషాదాలు జరుగుతుండటంతో ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.