Super Man OTT | డీసీ యూనివర్స్‌లో భాగంగా వచ్చి హాలీవుడ్లో జులై 11న విడుదలైన బ్లాక్ బస్టర్ అందుకున్న ‘సూపర్‌మ్యాన్’ (2025) చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా దర్శకుడు జేమ్స్ గన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జేమ్స్ గన్ వెల్లడించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూపర్‌మ్యాన్ (డేవిడ్ కోరెన్స్వెట్) తన సొంత గ్రహం అయిన క్రిప్టాన్‌ను అలాగే తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాను అన్న పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు. దీంతో భూమి మీదకి వచ్చి ఒక కుటుంబానికి దగ్గరై వారితో తన తన అస్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
మరోవైపు, పారిశ్రామికవేత్త అయిన లెక్స్ లూథర్ (నికలస్ హోల్ట్), సూపర్‌మ్యాన్ వలన భూమికి ముప్పు అని భావించి, అతన్ని అంతం చేయాలని కుట్ర పన్నుతాడు. హ్యామర్ ఆఫ్ బోరేవియా అనే పవర్ఫుల్ ఆయుధాన్ని సృష్టించి, ప్రజల్లో సూపర్మ్యాన్పై ద్వేషాన్ని పెంచుతాడు. ఈ పరిస్థితులలో, సూపర్‌మ్యాన్ తన విశ్వసనీయతను ఎలా నిరూపించుకున్నాడు? లెక్స్ లూథర్ చర్యలను ఎలా అడ్డుకున్నాడు? ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అతని ప్రేమికురాలు లొయిస్ లేన్ (రెచెల్) ఇతర సూపర్ హీరోస్ అతనికి ఎలా సహాయం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
#Superman is coming to your homes this Friday, 8/15. Available now for pre-order. Or catch it while it’s still in theaters! pic.twitter.com/xziRucg3xG
— James Gunn (@JamesGunn) August 12, 2025