విజయ్‌సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత ముఖ్యపాత్రల్లో నటించిన ‘సూపర్‌డీలక్స్’ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కుమార రాజా దర్శకత్వం వహించారు. నాలుగు కథల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్లో కనిపించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసల దక్కాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా సంగీతాన్నందించారు. నిర్మాతలు: దైవసిగమణి, తీర్థమలై, పూల మధు.