బిగ్ బాస్ సీజన్ 5లో 55వ ఎపిసోడ్ చాలా రసాభాసగా మారింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నానా రచ్చ చేశారు. త్రిమూర్తుల గ్యాంగ్‌తో జత కట్టిన రవి.. సన్నీతో మాట్లాడు కానీ మానస్‌తో మాట్లాడొద్దు అని జెస్సీకి సలహా ఇచ్చాడు. ఇక కాజల్..శ్రీరామ్ ఒక్కడే మాస్క్‌తో ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పింది. తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్.
ముందుగా కెప్టెన్ షణ్ను..కాజల్ పేరు సూచించాడు. సన్నీ.. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మానస్ కూడా జెస్సీనే వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. రవి, సిరి.. సన్నీని; అనీ.. ప్రియాంకను; ప్రియాంక సింగ్, లోబో.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నారు. జెస్సీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్ అని చెప్పే క్రమంలో వీళ్లిద్దరికీ మరోసారి గొడవైంది.
ఈ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షణ్ను.. సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అయితే కోపోద్రిక్తుడైన సన్నీ.. సిరి కత్తి పట్టుకోవడం మీకు కనిపించలేదా, అది తప్పుకాదా అని ప్రశ్నించాడు.ఏదేమైన అందరికన్నా సన్నీకి ఓట్లు ఎక్కువగా రావడంతో అతను జైలుకి వెళ్లక తప్పలేదు.