Sunny SanskariKi Tulsi Kumari బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్నీ సంస్కారికి తులసి కుమారి’ (Sunny SanskariKi Tulsi Kumari). ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాన్య మల్హోత్రా, రోహిత్ సరాఫ్, అక్షయ్ ఒబెరాయ్, మనీష్ పాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్-డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిరూ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.