ప్రేక్షకులకి వినోదం పంచేందుకు బిగ్ బాస్ ఒకరి రోల్ మరొకరు ప్లే చేసేలా రోల్ ప్లే అనే టాస్క్ ఇచ్చి ఫుల్ వినోదం పంచే ప్రయత్నం చేశాడు. ఇందులో ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని బిగ్ బాస్ బిగ్ ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా.. సన్నీలా సిరి.. షణ్ముఖ్‌లా సన్నీ.. కాజల్‌లా శ్రీరామ్.. ఆనీ మాస్టర్లా మానస్.. రవిలా కాజల్.. వారి వారి పాత్రలో పెర్ఫామెన్స్ ఇరగదీశారు.
షణ్ముఖ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన సన్నీ ఫుల్ హంగామా చేశాడు. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి కామెడీ చేస్తునే వాళ్లకి అదిరిపోయే పంచ్‌లు ఇచ్చాడు. సన్నీ పర్ఫార్మెన్స్ తట్టుకోలేక షణ్ముఖ్ టాస్క్ అయిపోయిన తర్వాత సీరియస్ అయ్యాడు.
సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని గట్టిగానే చెప్పాడు షణ్ముఖ్. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ. ఆ తర్వాత కూడా సన్నీ ప్రవర్తనపై బాధపడుతూ కనిపించాడు షణ్ముఖ్.