ఫొటో ఫ్రేములు తెలుసు.. కానీ గాజుల ఫ్రేములేంటి అనుకుంటున్నారా.. ఫ్యాషన్ గోడ మీద ఇప్పుడు వీటిదే హవా మరి! వీటిలో గాజు తరహాలో వచ్చి, దాని పైన రాళ్లు, డిజైన్లతో నగిషీ కలిగిన ఫ్రేమ్ ఉంటుంది. దీన్ని తెరిచి మూయవచ్చు. మనకు నచ్చిన రంగుల మట్టి గాజులు లేదా ప్లాస్టిక్ గాజులు రెండు మూడు లేదా అయిదు ఇలా చట్రం సైజుని బట్టి ఎంచుకుని అందులో ఉంచితే… అది ఓ కొత్త గాజులా కనిపిస్తుంది.
స్టయిలింగ్‌లో విభిన్నంగా కనిపించాలని అనుకునే వారికి ఇవి బాగా నచ్చుతున్నాయి. అంతేకాదు, మట్టి గాజులు మాత్రమే వేసుకోవాలన్న నియమం ఉన్నవారూ వీటిని ధరించి ఫ్యాన్సీ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. సాదా, పూల గాజులు, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న రెయిన్ డ్రాప్ వెరైటీలూ… ఇలా నచ్చినవి ఇందులో అమర్చుకొని ఒక్కోసారి ఒక్కో వెరైటీగా ధరించవచ్చు. పువ్వులు, తీగలు, నెమళ్లు, హంసల్లాంటి రకరకాల డిజైన్లు వీటిలో వస్తున్నాయి. అందులో నచ్చిన దాన్ని ఎంచుకుని మెచ్చినట్టు అమర్చుకోవడమే మన పని!