డిజిటల్ లావాదేవీల వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ మాయలోపడి మనకు తెలియకుండానే ఉన్న డబ్బంతా దుబారాగా ఖర్చు చేస్తున్నాం. ప్రతి పనికీ యూపీఐ పేమెంట్లు వాడకంతో నెలాఖరుకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. అలా, మనకు తెలియకుండానే మన జేబుకు చిల్లు పెడుతున్న డిజిటల్ పేమెంట్‌ను కట్టడి చేయడం చాలా అవసరం.
ఆన్లైన్ ఫుడ్: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం వల్ల డబ్బులు వృథా అవుతాయి. రెస్టారెంట్‌కు వెళ్లి కొనడం, ఇంటి దగ్గర ఫుడ్ వండుకొని తినడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది.
మైక్రో ట్రాన్సాక్షన్లు: టీ, కాఫీల కోసం రూ.10, రూ. 20 ఖర్చు చేయడం ఒక్క రోజుకి తక్కువే అనిపిస్తుంది. కానీ, నెల మొత్తంగా చూస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అయినట్లు తెలుస్తుంది.
బ్రాండ్: దుస్తులు కొనే సమయంలో నాణ్యత కంటే బ్రాండ్‌ను చూడటం వల్ల కూడా మనీ వృథా అవుతుంది. కాబట్టి బ్రాండ్ కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
అనవసర కొనుగోళ్లు: ఆఫర్లు, సేల్స్ చూసి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఖర్చు అవుతాయి. దీంతో మీ పర్స్ వేగంగా ఖాళీ అవుతుంది.
పొదుపు మరుపు: జీతం పడిన వెంటనే కొంత సొమ్మును పొదుపు చేయకుండా నెలాఖరున చూద్దామనే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ వైఖరిలో మార్పు రాకపోతే ఎన్నటికీ పొదుపు చేయలేరు.
ఇలా చేయండి: మీ డబ్బులను సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచడం వల్ల ఎక్కువ వడ్డీ రాదు. సేవింగ్స్ అకౌంట్లోని డబ్బును ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చండి.