Sunny Leone | మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ భామ సన్నీ లియోని. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా సన్నీ లియోని.. ఓ తమిళ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. గతంలో ఆమె ఎదుర్కొన్న భయానక సంఘటనలను తలచుకుని భావోద్వేగానికి లోనైంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో తనకు బెదిరింపులు వచ్చాయని.. నేను ఇండియాలో అడుగుపెడతానని అనుకోలేదంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
‘నా కెరీర్ ప్రారంభంలో నాకు బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ కొంతమంది మెసేజ్‌లు పంపేవాళ్లు. ఎక్కువగా భారత్ నుంచే వచ్చేవి. దీంతో ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. ఆ బెదిరింపులు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. అలాంటివి ఇప్పుడు ఎదురైతే అవి నన్ను అంత ప్రభావితం చేయవు. ఎందుకంటే ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Sunny Leone | ట్రెండీ అందాలతో సెగలు పుట్టిస్తున్న సన్నీలియోన్..