Mandira | 2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి సందడి చేసింది కెనడా బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone) . ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తెలుగులో కరెంట్ తీగ, పీఎస్వీ గరుడ వేగ, జిన్నా సినిమాలతో మెప్పించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ మందిర (Mandira)గా రాబోతుంది.
సన్నీలియోన్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మందిర. ఆర్ యువన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు.
జావెద్ రియాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పాపులర్ కమెడియన్ యోగిబాబు కీ రోల్ పోషించాడు. సన్నీలియోన్ అభిమానులు సినిమా చూసేందుకు రెడీగా ఉండండి మరి.
మందిర ట్రైలర్ ..
Watch Sunny Leone as Mandira Trailer Now..
Trailer on youtube: https://t.co/Iug6lPUGxc#sunnyleone #satish #yogibabu #mottarajendra #Mandira #Viisionmoviemakers @kommalapatisai @SunnyLeone pic.twitter.com/EejuUyWJC8
— Viisionmoviemakers (@Viisionmovie) October 29, 2024
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !