సోషల్ మీడియాను షేక్ చేసే ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను నిద్రపోకుండా చేస్తుంది బాలీవుడ్ తార సన్నీలియోన్ (Sunny Leone). ఎప్పటికపుడు ట్రెండీ అవతార్‌లో కనిపిస్తూ హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తుంటుంది. సన్నీలియోన్‌కు బీచ్ వెకేషన్ (beach vacation) అంటే ఎంతిష్టమో గతంలో నెట్టింట పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా తెలిసిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి బీచ్ టూర్ వేసింది. పింక్-గ్రే కలర్ బ్లాక్ మోనోకిని షూట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ పోజులిచ్చింది.
సీ బ్యాక్ డ్రాప్ లొకేషన్లో చుట్టూ తాటి చెట్లు, పైన నీలాకాశం మధ్యలో సన్నీలియోన్..ఇలా చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని అందరినీ ఫిదా చేస్తుంది. మరోవైపు స్పీడ్ బోట్‌పై ఫ్లోరల్ డిజైన్డ్ బికినీ వేర్లో స్టైలిష్ పోజు ఇచ్చింది. ఈ ఫొటోలకు పర్ ఫెక్ట్ సన్ డే అంటూ క్యాప్షన్ పెట్టింది. బికినీ వేర్లో బీచ్ వెకేషన్ స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
సన్నీలియోన్ ప్రస్తుతం హిందీలో మూడు, తమిళంలో మూడు, మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. రంగీలా సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది.