బిగ్ బాస్ టాస్క్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇవ్వగా, ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు ఫైర్ ఇంజిన్ ఎక్కి ఎవరికి పాస్ అక్కర్లేదనుకుంటున్నారో వారిని కాల్చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. సమయానుసారంగా సైరన్లు మోగుతాయి. ఆ సమయంలో ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కిన ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరిని కాపాడాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి ఫోటోలు కాలిపోతాయి అని బిగ్ బాస్ చెప్పారు.
చివరి వరకు ఎవరి ఫోటో అయితే కాలిపోకుండా ఉంటుందే వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతమవుతుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో మొదటి సైరన్‌కు రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. వారికి శ్రీరామచంద్ర, మానస్ ఫోటోలు వచ్చాయి. అందులోంచి శ్రీరామచంద్రను సేఫ్ చేసి.. మానస్ ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత మానస్ సన్నీలు ఎక్కారు. వారిద్దరు కలిసి ఆనీ మాస్టర్, రవిలోంచి.. ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేశారు. రవి ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత సిరి, షన్ను ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. సన్నీ, ప్రియాంకలోంచి.. సన్నీని కాపాడారు.. ప్రియాంక ఫోటోను కాల్చారు.
అనంతరం ఆనీ, శ్రీరామ ఫైర్ ఇంజన్ ఎక్కేసి..సిరి, షన్నులోంచి సిరిని సేఫ్ చేశారు.. ఆ తరువాత కాజల్ ప్రియాంక ఎక్కి.. సిరి, శ్రీరామలోంచి సిరిని సేఫ్ చేశారు. ఆ తరువాత ఆనీ, ప్రియాంక ఫైర్ ఇంజన్ ఎక్కి.. సన్నీ, కాజల్లోంచి..సన్నీని సేఫ్ చేశారు. ఆ తరువాత మానస్, కాజల్ ఫైర్ ఇంజన్ ఎక్కుతారు. వారికి ఆనీ, సిరిలోంచి ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇద్దరూ ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి బొమ్మలు కాలిపోతాయ్. చివరకు సన్నీ మిగిలిపోతాడు. సన్నీకే ఎవిక్షన్ పాస్ దక్కుతుందని అందరు భావిస్తున్నారు.