రీ క్రియేటషన్ టాస్క్‌లో భాగంగా తనని ఇమిటేట్ చేస్తున్నందుకు షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వెక్కిరిస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు షణ్ముఖ్.. నేనేం వెక్కిరించా యూటర్న్ తీసుకుని వెళ్లావ్ అని చెప్పాను.. బరాబర్ వెళ్లావ్.. అన్నీ నువ్ చెప్పిందే రైట్ అంటే హౌస్‌లో నడవదు.. నిన్న కూడా ఇలాగే చేశావ్.. నేను ఇమిటేట్ చేయట్లేదు.. రీ క్రియేషన్ అంటే ఇలాగే ఉంటుంది. అంటూ సీరియస్ అయ్యాడు సన్నీ.
నాకు నచ్చదు ఇమిటేట్ చేస్తే అని చెప్తున్నా.. నువ్ చేయాలని ఫిక్స్ అయ్యావ్ కదా.. నేను నాకు నచ్చినట్టే ఉంటా అని చెప్తాడు షణ్ముఖ్. దీంతో సన్నీ టెంపర్ రెట్టింపు అవుతుంది.. నాకు నచ్చదు అంటే కుదరదు.. మీరు చేయరు.. నేను చేస్తానంటే ఒప్పుకోరు.. ఇక్కడ బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి.. నాకు నచ్చదు అంటూ ఇక్కడ కుదరదు.. నేను చేయను అని వెళ్లి బిగ్ బాస్‌తో చెప్పుకో అని సీరియస్ అయ్యాడు సన్నీ. దీంతో షణ్ముఖ్.. అయితే నేను చేయను.. అంటూ అక్కడ నుంచి లేచివెళ్లిపోయి.. ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు.. అని చెప్తాడు.
సన్నీ లోపలికి వెళ్లి నేనేం అన్నారా? యూటర్న్ తీసుకున్నారని అంటే తప్పా? అని మానస్‌ని అడుగుతాడు. దీంతో మానస్.. ఆ మాట తప్పుకాదు కానీ.. నువ్ ఇమిటేట్ చేశావ్.. అదే వాడికి కాలింది.. నీ మనసులో వాళ్లని హర్ట్ చేయాలని లేకపోయినా నువ్ చెప్పిన విధానం అయితే అలాగే ఉంది అంటూ మానస్ బ్యాలెస్డ్గా మాట్లాడాడు. అయితే కాజల్ మాత్రం సన్నీ చేసిన దాంట్లో తప్పులేదని చెప్పింది.